చర్ల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.
ప్రజా గొంతుకన్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి;
చర్ల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికను చర్ల జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చర్ల మండల కేంద్రంలో ఆదివారం చర్ల మండల జర్నలిస్టులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా తోటమల్ల రమణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం మణికుమార్, గౌరవ సలహాదారుగా పొనుగంటి కృష్ణ, గౌరవ అధ్యక్షులుగా దొడ్డి హరినాగవర్మ, కోశాధికారిగా కొప్పుల రాంబాబు, సహాయ కార్యదర్శిగా బండారు భరణి, ప్రచార కార్యదర్శిగా మండలోజు వీరాచారి, కార్యవర్గ సభ్యులుగా ఎడెల్లి గణపతి,మండలోజు వేణుగోపాల చారి,తోటమల్ల కృష్ణారావు,ఇల్లంగి ఆశీర్వాదం, ఆఫీస్ ఇన్ ఛార్జ్ గా పటాన్ మహబూబ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కార్యదర్శి గడ్డం మణికుమార్ తెలిపారు.