చెన్నూర్ నియోజకవర్గ.ఎమ్మెల్యే బాల్క సుమన్ కి టూరిస్ట్ ప్రదేశం.
స్థానికేతరుడిని శాశ్వతంగా తరిమికొడుదాం
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు.
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా.
మందమర్రి మున్సిపాలిటీలో బుధవారం 2వ వార్డులో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు .డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానికేతరుడు అని సుమన్ కు చెన్నూరు టూరిస్ట్ ప్రదేశంగా మారింది అని, నియోజకవర్గ పరిధిలో రెండు భవనాలు నిర్మాణం చేసుకొని నెలకు రెండు రోజులు రెండు బంగ్లాలో వుండి వెళ్తున్నారు
స్థానికేతరుడుని శాశ్వతంగా తరిమికొడుదాము అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..