రుణమాఫీ పేరుతో రైతులని మళ్ళీ వంచించిన ముఖ్యమంత్రి కెసిఆర్
రాపోతు అనిల్ గౌడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
ప్రజా గొంతుక న్యూస్ :కల్వకుర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులని రుణమాఫీ పేరుతో మళ్ళీ వంచించారని యువజన కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ విమర్శించారు.గత 2018 ఎన్నికల ముందు లక్షరూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ ల ముందు కేవలం కేవలం రైతుల లక్ష రుణమాఫీ చేస్తామని కొత్త ఓట్ల డ్రామాలకి తెరలేపిందని మండిపడ్డారు.గత 5 ఏళ్ళుగా రైతులు తీసుకున్న అప్పు అంతకు అంత మిత్తీలు పెరిగాయని , లక్ష రుణం తీసుకున్న రైతుకు మిత్తి ఇంకో లక్ష అయిందని ఇప్పుడు కేవలం లక్ష రుణమాఫీ చేస్తే కేవలం మిత్తీలకే సరిపోయి రైతుల అసలు రుణం అలాగే ఉంటుందని రుణమాఫీ ఎక్కడ అవుతుందని మండిపడ్డారు.ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, హామీ ప్రకారం ఆలస్యం చేసింది ప్రభుత్వం కాబట్టి రైతుల మిత్తీ లు కూడా ప్రభుత్వమే భరించాలి అన్నారు.ఏక కాలంలో మొదటి బడ్జెట్ లోనే రుణమాఫీ చేసి ఉంటే రైతులు ఇబ్బంది పడేవారు కాదని , ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.చాలా మంది రైతుల నుంచి బ్యాంక్ లు అకౌంట్ లు హోల్డ్ లో ఉంచి మరీ రెన్యూవల్ చేయించారని వారందరికీ పూర్తి రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒకె ధపాలో రుణమాఫీ చేస్తామని , మొదటి బడ్జెట్ లోనే ఒకేసారి చేసి రైతులకి అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ రైతులకి ఒకే ధపాన 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ లో ఉన్న ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని , డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతు ద్రోహిగా కెసిఆర్ మిగిలిపోవడం ఖాయమన్నారు.