మీ కోసం వస్తున్నా..!
టిపిసీసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “వీర్లపల్లి శంకర్”
భగత్ సింగ్, టి అంజయ్య కాలనీల్లో కాంగ్రెస్ బస్తిబాట
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న వీర్లపల్లి శంకర్
ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో,ఆర్.ఆర్. గౌడ్.
మీకోసమే వస్తున్నా.. మీ సమస్యలను తెలుసుకుంటున్నా వాటిని పరిష్కరించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో గల భగత్ సింగ్ కాలనీ, టి. అంజయ్య కాలనీలో బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య ఆధ్వర్యంలో బస్తిబాట కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ బాటలో ఏ ఇంటిని సందర్శించినా సమస్యలు తెలుస్తున్నాయని అన్ని సమస్యలే నెలకొన్నాయని అన్నారు. మౌలిక సదుపాయాలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజలతో మాట్లాడక వారి సమస్యలు విన్నాక కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేవలం మాటల తప్ప చేతలు లేని ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు చెబుతున్న సమస్యలు వింటుంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ప్రజలకు ప్రభుత్వంపై విసుగు పుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, బాబర్ ఖాన్, చెంది తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, యూత్ కాంగ్రెస్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అర్జున్ లక్ష్మణ్, ఎస్ టి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు శీను నాయక్, కొమ్ము కృష్ణ, అంజి యాదవ్, పురుషోత్తం రెడ్డి ముబారక్, నల్లమోని శ్రీధర్, మైనార్టీ సెల్ హలీం సాకేత్, రవి, మాధవులు, ప్రవీణ్, మన్నె రవి, రాజు నాయక్, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్, కిషోర్ యాదవ్, జగన్, గోపాల్ నాయక్, శబద్దీన్, పద్మారం వెంకటేష్, గంగ ముని సత్తయ్య, నవీన్, శ్రీధర్, అజ్మత్ ఖాన్, గండ్రాతి సాయి, హైదర్ గోరి, శేఖర్, రాజు, మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.