పడమటికేశవపూర్ గ్రామంలో జోరు అందుకున్న కాంగ్రెస్ ప్రచారం
నీ కాళ్ళు మొక్కుతా అమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయి ప్రచారంలో ఓటర్ పాదాలకు దండం పెడుతున్న సర్పంచ్ గిద్దల రమేష్
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు.
గడప గడపకు తిరుగుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి కొమ్మూరి ప్రతాపరెడ్డిని గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు నేరుగా అందుతాయని కొమ్మూరి ప్రతాపరెడ్డిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ శ్రవణ్ కుమార్ రెడ్డి ,సర్పంచ్ గిద్దల రమేష్, జంగిటి విద్యానాథ్,అరుగొండపరుశరాములు, వార్డు సభ్యులు చల్ల సంతోష్ రెడ్డి ,బండారి భాస్కర్, కైత వినయ్, నాయకులు నిమ్మల బాల్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అబ్బాస్, బాల్రెడ్డి , రాజిరెడ్డి, రవి ,నిమ్మ కరుణాకర్ రెడ్డి తిరుపతి, రామాచారి, అంజనేయులు, కిష్టయ్య 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది