గడపగడపకూ కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీ కార్డుతో ప్రచారం చేసిన …తాటి
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట
నియోజకవర్గం,చండ్రుగొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం గ్యారెంటీ కార్డుతో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు.
తొలుత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలుచేయనున్న అభయహస్తం గ్యారంటీ కార్డును ప్రదర్శిస్తూ పథకాలను ప్రజలకు వివరించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500లతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుభరోసా పేరిట ప్రతి ఏటా రూ.15వేలు పెట్టుబడిసాయం,
వ్యవసా కూలీలకు రూ.12వేలు, వరిపంటకు రూ.500 బోనస్, గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లులేనివారికి ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందని ప్రచారం చేసి ఓటర్లను ఓట్లు అభ్యర్ధించారు. విద్యార్థులకు యువవికాసం ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు రూ. 5 లక్షలు విద్యాభరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు రూ.4వేల పింఛన్, వైద్యఖర్చుల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ద్వారా రూ. 10లక్షలు అందించడం జరుగుతుందన్నారు. తుక్కుగూడ సభావేదికగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ ఈ హామీలు ప్రకటించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దారం గోవింద రెడ్డి ,ఇంజము అప్పారావు,నల్లమోతు రమణ,షాభీర్ హుస్సేన్ ,మాజీ ఎంపీపీ,,గుగులోత్ బాబు, పొన్నేబోయిన,బీక్షమయ్య ,తుమ్మల పల్లి సురేష్ ,కేశబోయిన నరసింహ రావు సంకా కృపాకర్,ఉప సర్పంచ్ దారావత్,రామారావు,చెరుకూరి రవి,మాజీ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణీ,అన్నపురెడ్డి పల్లి మండల నాయకులు భీముడు నాయక్ ఆటో యూనియన్ నాయకులు మధార్ సాహెబ్ (బాబా),మండల బీసీ సెల్ అధ్యక్షులు అంతటి రామకృష్ణ,మండల కిషాన్ సెల్ అధ్యక్షులుబొర్ర,సురేష్,సర్పంచ్ పద్ధం వినోద్,మండల
నాయకులు,బడుగు,శంకర్,కొమ్మిని,రామారావు,వేముల,కోటేశ్వరరావు,బుంగా శ్రీను, మల్లం కృష్ణయ్య, చాపల మడుగు మనోహర్, ఒర్సు రామకృష్ణ, వడ్ల ముడి నరసింహ రావు, రెడ్డి పోగు సురేష్, లక్మా, కడియాల పుల్లయ్య, కొలిపాక అప్పారావు, కుంచపు కన్నయ్య, బత్తుల లక్ష్మణ్, బడుగు చిన్న ఎల్లయ్య, బడుగు,దేవదాస్,యలమంధల శేఖర్, బడుగు రాంబాబు, తలారి రాంబాబు, బడుగు రవి, తాళ్ళ పల్లి వెంకట నర్సు, బడుగు కృష్ణవేణి, రుక్మిణి, చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో. ఆర్డినేటర్.. బడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.