*ఘనంగా కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు
*పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు
*షాద్ నగర్/ప్రజా గొంతుక ప్రతినిధి
షాద్ నగర్ నియోజవర్గం రాయికల్ గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి, పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించారు.అనంతరం కార్యకర్తలను ,అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ…
ప్రజా సేవకే తన జీవితం అంకితమని తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున అభిమానులు,కార్యకర్తలు,శ్రేయోభిలాషులు తరలిరావడం పూర్వ జన్మ సుకృతమని,మనిషి డబ్బు ఎంతైనా సంపాదిస్తాడు కానీ ప్రజల అభిమానాన్ని సంపాదించడం గొప్ప విషయం అని అన్నారు.
ఈ జన్మదిన వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మామిడిపల్లి వెంకట్ రెడ్డి , మోహన్ రెడ్డి , రామేశ్వరం సర్పంచ్ సంపత్ కుమార్ , డిప్యూటీ సర్పంచ్ మల్లేష్ , నరేష్ , శివ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.