గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
ప్రజా గొంతుక //వరంగల్ జిల్లా //సంగెం ప్రతినిధి:
మొండ్రాయి గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డిని నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
బుధవారం రోజు ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి చెక్కుల పంపిణీ కొరకు వస్తున్న తరుణంలో మొండ్రాయి గ్రామ చౌరస్తాలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అడ్డగించి పలు సమస్యలపై నిలదీశారు సమస్యల లో
ఉన్న మచ్చాపూర్ నుండి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పనులు గత నాలుగు నెలలు గడుస్తున్నాయి ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం లేదని గ్రామంలో కొత్తగా పోసిన సీసీ రోడ్డు,ప్రక్కలకు సైడ్ డ్రైనేజీలు త్వరగా పూర్తిచేయాలని ప్రాథమిక ఆరోగ్య చికిత్సకేంద్రాన్ని వినియోగం లోకి తేవాలని
, పశు వైద్యశాల నిర్మించకపోవడం, గొల్లపల్లి నుండి కొమ్మాల రోడ్డు పూర్తి చేయాలని వీటిని ఇంకెంతకాలం పెండింగ్లో పెడతారని గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు నిలదీశారు
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ విజయ్ కుమార్, నాయకులు మడత కేశవులు,అనుముల కుమారస్వామి నీరటి కుమారస్వామి, దుడ్డే చిరంజీవి,అనుముల రాములు, ఇజ్జగిరి రాజేష్, పరికి దయాకర్, పరికి ఏసోబు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు