జంగాలపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్
ప్రజా గొంతుక/ గంగారం/ ఆగస్టు/28
గౌరవ జిల్లా ఎస్.పి. శ్రీ. శరత్ చంద్ర పవార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలమేరకు, గూడూరు సీఐ ఫనిధర్ గారి ఆధ్వర్యంలో గంగారం ఎస్.ఐ. దిలీప్ గారు గంగారం మండలం లోని జంగాలపల్లి గ్రామం లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీ.ఐ ఫణిధర్ మాట్లాడుతూ, గ్రామం లో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లైతే వారి పై కటిన చర్యలు తీసుకుంటామని, వీలైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, మంచి వాళ్లకు పోలీసుల సహకారం ఎల్లపుడూ ఉంటుందని తెలిపారు.
రాబోయేది ఎన్నికల సమయం, కావున గ్రామం లో ఎలాంటి ఘర్షనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో జరిగేలా అన్ని వర్గాలు సహకరించాలని చెప్పారు. అదేవిధంగా గ్రామం లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినట్లైతే వారి సమాచారం వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు.
అదేవిధంగా ఎస్.ఐ దిలీప్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారు ఇక నుండి అన్ని మానుకొని సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు. ఈ యొక్క కార్డన్ సెర్చ్ తనికీలలో భాగంగా 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు,
120 లీటర్ల బెల్లం పానకం డ్రమ్ములను ధ్వంసం చేశారు. సదరు వ్యక్తుల పై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో సీ.ఐ ఫనిధర్, ఎస్. ఐ దిలీప్ తో పాటుగా గూడూరు ఎస్.ఐ రాణా ప్రతాప్, ఆర్.ఎస్.ఐ శేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బంది తో పాటుగా, గంగారం, గూడూరు, కొత్తగూడ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.