*శంషాబాద్ బాల యేసు కాలనీలో వంట గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు
*గాయపడిన మహిళ 9 నెలల గర్భిణి
*ప్రజా గొంతుక :రంగా రెడ్డి బ్యూరో ఆర్.ఆర్. గౌడ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని సిలిండర్ పేలిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మహిళా ప్రస్తుతం 9 నెలల గర్భిణీ. కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బాల యేసు కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
కేశవులు, మొగులమ్మ దంపతులు తమ కుమారుడితో కలిసి గత కొంతకాలంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బాల యేసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మొగులమ్మ (25) కు తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో గాయపడ్డ భార్యను రక్షించబోయి ఆమె భర్త కేశవులు (28) కి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మగులమ్మ ప్రస్తుతం 9 నెలల గర్భిణి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు క్షతగాత్రుల ను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మొగులమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.