*మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి*
*సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి*
*ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతిపత్రం ఇస్తున్న ఏఐటియుసి సిఐటియు*
ప్రజా గొంతుక న్యూస్ :రాజేంద్ర నగర్
మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత రెండు మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు బుధవారం ఉదయం,స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండలంలో పర్యటన చేసిన సందర్భంగా ఆయనకు ఏఐటియుసి సిఐటియు నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులు రుచికరమైన వంటలు చేస్తూ పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్న వీరికి ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం వీరిని రెగ్యులరేషన్ చేయకపోవడం బాధాకరమని నర్రగిరి విమర్శించారు మధ్యాహ్నం భోజనం కార్మికులు చేస్తున్న ఈ సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని మీ పోరాటం విజయవంతం అయ్యేవరకు మేము అండగా నిలబడతామని కార్మికులకు నరగిరి భరోసా ఇచ్చారు.ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాజు సిఐటియు నాయకులు మరియు మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొన్నారు