ఆశ వర్కర్ల సమ్మెకు సంఘీభావం తెలియజేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం,
ములకలపల్లి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె కు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమ్మెకు సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం జరిగింది.ఈ ఆశ వర్కర్ల నిరవధిక సమ్మెను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు కిషోర్ పాల్గొని మాట్లాడుతూ,
ఆశ వర్కర్ల సమస్యలు వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని ఆశ వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని,ఆశ వర్కర్ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల చేత వెట్టి చాకిరికి చేపిస్తుందని ఆశ వర్కర్ల లను తీవ్ర ఇబ్బందులు చేస్తుందని,ఆశ వర్కర్లకు పిక్సీడ్ వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని,వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా,ఉద్యోగ భద్రత,రిటైర్మెంట్,బెనిఫిట్స్,ఐదు లక్షల ఇవ్వాలని.32 రకాల రిజిస్టర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి.
జాబ్ చార్ట్ విడుదల చేయాలి,ఆశ వర్కర్ల ప్రసూతి సెలవులు పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలి.పని భారం తగ్గించాలి అని ఏఎన్ఎం, జి ఎన్ ఎం పోస్టులలో అర్హులైన ఆశలకు ప్రమోషన్ కల్పించాలి,హెల్త్ కార్డు వంటివి మొదలగున సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శి కోర్స రామకృష్ణ మండల కమిటీ సభ్యులు నకిరికంటి నాగేశ్వరావు శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు ఎర్రగొర్ల రామారావు బండారు నాగేంద్రబాబు కీసరి గోపాలరావు పాయం రాజులు కీసరి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.