పత్తి పంటలో అధిక దిగుబడినిస్తున్న మహికో సీడ్స్ బౌన్సర్ బిజీ2
— ఆగ్రంపాడులో బౌన్సర్ బిజీ2 విత్తనములపై పంట ప్రదర్శన క్షేత్రం
ప్రజాగొంతుక ప్రతినిధి/ఆగ్రంపాడు/ఆత్మకూరు:
పత్తి పంటలో అధిక దిగుబడి కోసం మహికో సీడ్స్ బాహుబలి+ బిజీ2 విత్తనాలు మేలైనవని మహికో సీడ్స్ కంపెనీ టెరిటరి మేనేజర్ విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.శనివారం వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం ఆగ్రంపాడు గ్రామంలో ఆవుల శ్రీనివాస్ పొలంలో మహికో సీడ్స్ వారి బౌన్సర్ బిజీ2 విత్తనాల రైతు ప్రదర్శన క్షేత్రంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు బౌన్సర్ బిజీ II విత్తనం కాయ పెద్దగా ఉంటుందని,ఎటువంటి బెట్ట పరిస్థితిని అయినా తట్టుకుంటుందని,రానున్న కాలంలో రైతులు మహికో సీడ్స్ వారి బాహుబలి విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందగలరని రైతులకు తెలిపారు.మహికో సీడ్స్ కంపెనీలో మరో రెండు రకాలు బాహుబలి బిజీII,ధనదేవ్ బిజీII
విత్తనాలు కూడా ఎంతో మేలు చేసే రకాలని రైతులకు వివరించారు.రైతు శ్రీనివాస్ తన 2 ఎకరాలలో బౌన్సర్ బిజీ 2 పత్తి పంట వేయగా పంట క్షేత్రం ప్రదర్శనకు సుమారు 15 గ్రామాల నుంచి 250 మంది రైతులు పాల్గొన్నారు.బౌన్సర్ పత్తి పంటను చూసిన రైతులు చాలా బాగుందని చెట్టుకు 90 నుండి 100 కాయలు వరకు ఉన్నాయని,బౌన్సర్ బిజీ2 పంటను చూసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్లునరేందర్ రెడ్డి,రఘురామ రాజు,దేవ సందీప్, డీలర్లు,టిబిఎం విష్ణు వర్థన్ రెడ్డి మరియు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.