దళిత బంధు . అర్హులకు ఇవ్వకపోతే ఆందోళన చేస్తాం… సుద్దాల సాయికుమార్ హెచ్చరిక..
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 20 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పేరుతో అర్హులైన దళితులను మోసమే చేస్తుందని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్ విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పూటకో పథకంతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, దళిత బంధు లో శాసనసభ్యులు,
మధ్య దళారుల ప్రోత్బలంతో నిజమైన దళితులకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అందజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్, బీసీ బందు, ఏ బంధు ప్రకటించిన అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఖాతాల్లోకి వెళ్తున్నాయని, వీటిని మానుకొని అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, లేనిపక్షంలో ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పారదర్శకత పాటించి రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.