*గుండెపోటుతో మృతి చెందిన డ్యాన్సర్*
-డ్యాన్స్ స్టూడియోలో వర్క్ చేయడానికి పోయి డ్యాన్స్ చేస్తుండగానే మృత్యువు ఒడిలేకి వెళ్లిన సిలువేరు మధు (ఆరెంజ్) మధు..
ఫోటో రైటప్: ఆరెంజ్ మధు ఫైల్ ఫోటో
వరంగల్, అక్టోబర్ 10 (ప్రజా గొంతుక):
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ బాలాజీ నగర్ కు చెందిన సిలువేరు రమ కుమారస్వామి రెండవ కుమారుడైన సిలువేరు మధు (ఆరెంజ్ మధు) డ్యాన్స్ క్లాసులు చెప్పుకుంటూ.. జీవించేవాడు.
దాదాపు మూడు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో డ్యాన్స్ క్లాసులు నిర్వహిస్తున్న మధు కు సోమవారం ఉదయం గుండెపోటు అతిగమించడంతో తోటి స్నేహితులు హాస్పిటల్ కు తీసుకుపోదాం అనుకునే సమయంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృత్యువాత చెందిన సిలువేరు మధు (ఆరెంజ్) మధు ను స్వగ్రహమైన 14వ డివిజన్ ఏనుమాముల గ్రామంలోని బాలాజీ నగర్ లో ఘనంగా అంతరిక్రియలు ఘనంగా జరిపించడం జరిగింది.