డిసిసి వైస్ . ప్రెసిడెంట్ గా. వాకిటి అనంతరెడ్డి.. నియామకం…
సెప్టెంబర్ 28 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా;- వలిగొండ మండలం. పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన వాకిటి అనంతరెడ్డి ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ స్టార్ క్యాంపెనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నియామక పత్రాన్ని గురువారం అందజేశారు ..
ఈ సందర్భంగా వాకిటి అనంతరెడ్డి మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసిసి ఉపాధ్యక్షుడు.గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి.కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందాల రామకృష్ణారెడ్డి , కిసాన్ సెల్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మర్రి నర్సింహారెడ్డి , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్… తదితరులు పాల్గొన్నారు..