నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొవాలని డి ఈ కి వినతి
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకిర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని తుమ్మడం శివారులో ఆర్ అండ్ బి రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నాసిరకంగా పనులు చేస్తున్నారని శుక్రవారం నల్లగొండ ఆర్ అండ్ బి క్వాలిటీ అండ్ కంట్రోల్, డి.ఈ నరసింహారావుకు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యమైన మెటీరియల్ వాడటం లేదని, ఇసుక వాడకుండా రాక్ డస్ట్ వినియోగిస్తున్నారని, క్వాలిటీ ఐరన్ వాడటం లేదని అన్నారు. సైట్ ఇంజనీర్ లేకుండా సుతారు మేస్త్రీలతో పనులు చేయిస్తున్నారని, బ్రిడ్జి వాల్స్ వంకర టింకరగా పోసారని, సరైన మోతాదులో ఇసుక,కంకర,సిమెంట్,వాడకపోవడం వల్ల, క్యూరింగ్ సరిగా లేకపోవడం వల్ల చేతులతో గిల్లితేనే మట్టి గోడలా రాలిపోతుందని వారన్నారు.
నిర్మాణ ప్రదేశంలో ఎటువంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదని, డైవర్షన్ రోడ్డు సరిగా వేయలేదని, దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, అనేకమంది గాయాల పాలయ్యారని అన్నారు. త్వరగా పూర్తి చేయాల్సిన పనులు సంవత్సరాలకొద్దీ కొనసాగించడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని, బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బి, ఏ ఈ డీ ఈ లు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై ముడుపులకు ఆశపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.పనుల్లో వేగవంతం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని వారన్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల,నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, పనుల్లో జాప్యం జరుగుతుందని, నాణ్యత కొరవడుతుందని, అనధికాలంలోనే బ్రిడ్జి శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉందని, దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారు అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే, బ్రిడ్జి నిర్మాణాన్ని కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని, ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని, నాణ్యత ప్రమాణాలతో త్వరగా బ్రిడ్జిని పూర్తి చేయాలని లేని యడల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని, ఆందోళన కార్యక్రమా లు నిర్వహిస్తమన్నారు