సకాలంలో సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి…… అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
ప్రజా గొంతుక పెద్దపల్లి :
సకాలంలో సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.
బుధవారం స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సీఎంఆర్ రైస్ డెలివరీ పై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు.
*అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,* రైస్ మిల్లర్లు సకాలంలో ఖరీఫ్ 2022-23న సంబంధించి సిఎంఆర్ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నిర్దేశిత సమయంలో లక్ష్యాలు చేరుకోని రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి, రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ చేయాలనీ, వానాకాలం పంటకు సంబంధించిన పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రైస్ మిల్లర్లు సైతం నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైస్ డెలీవరి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా మేనేజర్ సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, మిల్లర్లు తిరుపతి రెడ్డి, అశోక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.