అభివృద్ధి నా అభిమతం
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
దేవునిపల్లి నుండి తంగెలపల్లి గ్రామానికి రూ. 64 లక్షలతో బి.టి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ప్రజా గొంతుక న్యూస్ : రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ ఆర్ గౌడ్
షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన నియోజక వర్గంగా ఏర్పాటు చేస్తానని
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. కొందుర్గ్ మండలంలోని తిర్మల్ దేవునిపల్లి నుండి తంగెలపల్లి గ్రామానికి రూ. 64 లక్షలతో బి.టి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు.
అనంతరం తంగెలపల్లి గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభించారు.