బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
: ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పార్వతమ్మ
మాడుగుల ప్రజా గొంతుక ప్రతినిధి :
సుస్థిర అభివృద్ధి సాధ్యమని నల్లవారి పల్లి గ్రామ సర్పంచ్ రుద్రాక్ష పార్వతమ్మ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే పేర్కొన్నారు. మాడుగుల మండలం నల్లవారి పల్లి గ్రామంలో సర్పంచ్ రుద్రాక్ష పార్వతమ్మ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులతో కలిసి కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి జైపాల్ యాదవ్ ను భారీ మెజారిటీ గెలిపించాలని ఆమె కోరారు.సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే అందరికీ అభివృద్ధి పలాలు అందాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు