*బిజెపి నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది*
*బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య*
*నిరుద్యోగులను దగా చేసిన కెసిఆర్ ప్రభుత్వం*
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి*
*రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజా గొంతుక*
కేశంపేట మండలం అల్వల గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్యకు మద్దత్తుగా బిజెపి నాయకులు ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,దేపల్లి అశోక్ గౌడ్, మోటే శ్రీనివాస్, రోళ్లు రఘురామ్ గౌడ్, పల్లె అంజయ్య, చిట్టెం లక్ష్మికాంత్ రెడ్డి, శివాజీ, కానం ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అందె బాబయ్య మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు, ప్రజలు కట్టిన పన్నులు మాత్రమే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందించిందని అన్నారు.
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఇంటింటికి టాయిలెట్లు నిర్మించారని, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే మోడీ వల్లనే అని అన్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని ఇవ్వలేదని, షాద్ నగర్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మంది ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కావాలని అప్లికేషన్లు పెట్టుకుంటే అవి అమలు చేయకుండా,ఎనిమిది నెలల్లో 120 పడకల ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. మరియు కోట్ల రూపాయలతో సెకరేట్రేట్ ను కట్టుకున్నారు కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మాత్రం భర్తీ చేయలేదని అన్నారు.
కానీ మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 20 లక్షల కుటుంబాలకు నాణ్యమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి,మంజూరు చేసారని అన్నారు. ఇంటింటికి త్రాగు నీరు ఇస్తా అన్నారు కదా, షాద్ నగర్ లో నల్లా లేని వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయని అన్నారు. షాద్ నగర్ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.
మన నిధులు మనకు రాకుండా దారి మల్లిస్తూ, అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు.
ఈ ఎన్నికల్లో బిజెపి ని అందరించండి, షాద్ నగర్ అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం అన్నారు,2019 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి 3116 ఇస్తానని నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు.
వేసిన ఉద్యోగ నోటిఫికెషన్ల పేపర్లు లీకేజీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడండని అన్నారు.
గత తొమిదిన్నర సంవత్సరాలుగా నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వం BRS ప్రభుత్వమని అన్నారు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల పాలనలో అవినీతి, కుటుంబ పాలనా, నియంతృత్వ పాలన అని మండిపడ్డారు.
అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు దగా చేశాయని విమర్శించారు.
రామరాజ్యం కావాలంటే ఈ ఎన్నికల్లో తెలంగాణలో మోడీ రాజ్యం రావాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, బాబన్న ను గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో యుగేందర్, విట్టల్ గౌడ్, శ్రీనివాస్, రొళ్లు రాధిక, కుమ్మరి నర్సింలు, కుమార్, సుబ్రహ్మణ్యం, అభిషేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.