లక్ష్మీసీడ్, విత్తనాల కంపెనీఆధ్వర్యంలోమట్టిగణపతులపంపిణీ.
శక్తి ట్రేడర్స్ యజమాని కోవెలదిన్నె సర్వేశ్వర్ రెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
వినాయకచవితిపర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ సీడ్విత్తనాలకంపని ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని రైతులకు,డీలర్లకు మట్టి గణపతి ప్రతిమలు తన దుకాణంనందుఆదివారంఅందజేయడం జరిగిందని శాంతినగర్ శక్తి ట్రేడర్స్ యజమాని కోయిలదిన్నె సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈమట్టివినాయకప్రతిమలపంపిణీకార్య క్రమానికి ముఖ్యఅతిథిగా కంపెనీ ప్రతినిది గంగారెడ్డిహాజరై తన చేతుల మీదుగా మట్టివినాయకవిగ్రహాలనుపంపిణీచేశారు. ఈ సందర్భంగా,గంగారెడ్డిమాట్లాడుతూ,రైతులకు,డీలర్లకు కేవలం మట్టి గణపతివిగ్రహాలుమాత్రమేప్రతిష్టించి,నవరాత్రులు పూజ చేయాలని కంపెనీప్రతినిధిగంగారెడ్డిసూచించడంజరిగింది.వినాయకవిగ్రహాలతయారీలో మితి మీరిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్,అద్దకపు రంగుల వినియోగం వల్ల నిమజ్జనం చేసేటప్పుడు నీటి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉన్నందున మట్టిగణపతులవినియోగాన్నిపెంచాలనేఉద్దేశ్యంతో రైతులకు, డీలర్లకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు శాంతినగర్, శక్తి ట్రేడర్స్ డిస్ట్రిబ్యూటర్ సర్వేశ్వర్ రెడ్డిమీడియాకుతెలిపారు.
ఈ కార్యక్రమంలో శక్తి ట్రేడర్స్ యజమాని సర్వేశ్వర్ రెడ్డి తో పాటు కంపెనీ ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.