కనీస మద్దతు ధరపై వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించిన…
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రజా గొంతుక పెద్దపల్లి :
కనీస మద్దతు ధరపై వరి ధాన్యం కొనుగోలును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు.
బుధవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి 2203/-, కామన్ రకం ధాన్యానికి 2,183/- రూపాయలు ఒక క్వింటాలుకు నిర్ణయింప బడినదని, జిల్లాలో 31 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రైతులు దళారులు, ఇతరులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని అమ్ముకుని కనీస మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, డిసిఎంఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్దపల్లి కార్యదర్శి పృథ్వీరాజ్, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.