సామాజికసేవాకార్యక్రమాల్లోచురుకుగాపాల్గొంటున్న మున్సిపల్ చైర్ పర్సన్ ని సన్మానించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి…
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జిల్లాకలెక్టరేట్,కార్యాలయంలో వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్.ఎస్. కరుణ సూరి ని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు కాంతిఘనంగాసన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు
క్రాంతిమాట్లాడుతూ,వడ్డేపల్లిమండలంలోనికొంతమందిటీబీవ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని వారికి ఆరు(6) నెలలకు సరిపడా పౌష్ఠిక ఆహారంఅందించినందుకు గాను వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్ఎస్ కరుణ సూరి కి నిక్షయ మిత్ర అవార్డును అందజేశారు.మున్సిపల్ చైర్పర్సన్ గా ఒకవైపు
సేవలందిస్తూ,మరో వైపు వివిధ సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తన చేతుల మీదుగా అప్ప్రిసియేషన్ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ,డిప్యూటీ డిఎంహెచ్ఓ,జిల్లాఅధికారులు తదితరులు పాల్గొన్నారు.