రైల్వే స్టేషన్ మరియు పరిసరాలు తనికి చేసిన జిల్లా ఎస్పీ చంద్ర మోహన్
ప్రజా గొంతుక/ మహబూబాబాద్/ అక్టోబర్11
ఎస్పీ గారు మాట్లాడుతూ…రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల అక్రమ రవాణాలను గుర్తించడానికి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా పరిధిలో మొత్తం పదకొండు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎన్నికల సమీపిస్తున్న వేళ మద్యం నగదు, రవాణా అయ్యే అవకాశాలు ఉన్నందున మహబూబాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బైకులు కార్లు బస్సులు ఆటోలు ఇలా అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాహనాలు విడిచిపెడుతున్నారు.. నగదు గాని బంగారం గాని ఎలాంటి విలువైన వస్తువులు అయినా సరే సంబంధిత ధ్రువపత్రాలు లేకుండా రవాణా చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.