రక్తదానం చేయండి ,మరొక్కరి ప్రాణాలను కాపాడండి.
సీఐ జగదీష్
సుల్తానాబాద్ /ప్రజా గొంతుక
రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదాతలు అవుతారని సుల్తానాబాద్ సిఐ కర్ర జగదీష్ అన్నారు .శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలర్లు ఆర్.ఎం.పి పి.ఎం.పి తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలో రామగుండం సిపి రెమో రాజేశ్వరి పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో 5555 మందితో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని కౌన్సిలర్లు ఆర్ఎంపి ఎంపీలు మహిళా సంఘాల ప్రతినిధులు విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. అనేకమంది తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అందక మృత్యువాత పడుతున్నారని అలాంటి రోగులకు రక్తాన్ని సేకరించి అందిస్తే వారి ప్రాణాలు నిలిపిన వారిని అవుతామని అలాగే వివిధ సందర్భాలలో ప్రమాదాలు సంభవించినప్పుడు సైతం అనేకమంది తమ ప్రాణాలను రక్తం అందక కోల్పోతున్నారని దాతలు ముందుకు వచ్చి ఒక్కరు 10 మందితో రక్తదానాన్ని అందించేలా చూడాలన్నారు . రక్తం అందించిన వారికి ఎప్పటికప్పుడు నూతనంగా రక్తం ఏర్పడి రీ ఫ్రెష్ అవుతుందని తెలిపారు .నూతన రక్తం ఏర్పడడంతో చురుకుగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజేందర్, పోలీస్ సిబ్బంది, పలుగురు పాల్గొన్నారు.