**అభిమానంతో జరిగిన సంఘటన అపార్థం చేసుకోవద్దు*
– *సీనియర్ అడ్వకేట్ వై రవికుమార్ యాదవ్ ప్రకటన**
షాద్ నగర్ ప్రజా గొంతుక న్యూస్
షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడాల్సిన పనిలేదు . మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంజన్నను తలపై కొడుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ అవుతున్న సందర్భంగా ..
చెప్పడమైనది, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రంగారెడ్డి జిల్లా సంగెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లో భాగంగా అంజన్న ఒక్కసారి చూడు షాదనగర్ కి ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినావు అంటూ శిలాఫలకాన్ని చూపిస్తున్న క్రమంలో అంజన్న భుజం తటే క్రమంలో మంత్రి చేయి అంజన్న తలపై తగిలింది.
అంతే కాని… కావాలని చేసినా పని కాదు. దీనిని కొందరు వక్రీకరించి వైరల్ చేస్తున్నారు. అంజన్నని ఇప్పటివరకు ఎంత పెద్ద నాయకుడైనా అంజన్న సంబోధిస్తారు. ఆయన ఒక అజాతశత్రువు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరు.