- నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అందించాలి
కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ప్రజా గొంతుక, పరిగి డివిజన్ ప్రతినిధి:
పరిగి నియోజకవర్గ,పూడూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పేద ప్రజల ఓట్ల కోసం మోసం చేసిన
- కేసీఆర్ మాయ మాటలు చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాల నుండి ఇండ్లు బేస్మెంట్ వరకు లేపి నిరుపయోగంగా నిలిచిపోవడం జరిగింది,
- కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పరిశీలించి అట్టి వివరాలను వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పటేల్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
- వెంటనే బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎన్నికల సమర్పిస్తున్న వేళ మళ్లీ ప్రజలను విద్యార్థులను యువకులను రైతులను నిరుద్యోగులను మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆలోచించి వచ్చే 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బిజెపికి కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన ప్రజలను కోరడం జరిగింది,
వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి నాయకులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి , సీనియర్ నాయకులు సుభాన్ రాజు, బూత్ అధ్యక్షులు సత్యనారాయణ ,పాండు, శ్రీశైలం, స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.