పోగొట్టుకున్న మొబైల్ ని అందజేసిన దుమ్మగూడెం పోలీస్
ప్రజాగొంతుక ప్రతినిధి/ దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి మొబైల్ ను రికవరీ చేసి అందజేశారు. బండిరేవు గ్రామ గ్రామానికి చెందిన నక్క శరత్ అనే వ్యక్తి ఇటీవల తన మొబైల్ ఫోన్ ని పోగొట్టుకోగా,
నూతనంగా అందుబాటులోకి వచ్చిన సిఇఐఆర్ పోర్టల్ ద్వారాwww.ceir.gov.in వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి పోగొట్టుకున్న ఫోన్ వివరాలు అప్లోడ్ చేశారు. దీంతో సిఇఐఆర్ సైట్ ద్వారా మొబైల్ ని కనుక్కొని సంబంధిత వ్యక్తికి మొబైల్ అందజేశారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం సబ్ ఇన్స్పెక్టర్ పోటు. గణేష్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్ లను పోగొట్టుకున్నట్లయితే వారు సీఐఆర్ పోర్టల్
ద్వారాwww.ceir.gov.in వెబ్సైట్లోకి వెళ్లి, అందులో ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని, తద్వారా త్వరగా వారి ఫోన్లను రికవరీ చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ సి ఇ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసే చేసుకోవాలని తెలియజేశారు.