ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి
ప్రజా గొంతుక/ మహబూబాబాద్/ సెప్టెంబర్/8
తొర్రూరు, మరిపెడ , దంతలపాల్లీ, పెద్ద వంగర పోలీస్ స్టేషన్ లను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ గారు
జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ గారు తొర్రూరు, మరిపెడ , దంతలపాల్లీ, పెద్ద వంగర పోలీస్ స్టేషన్ లను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో ను, పరిసరాలను, రికార్డ్స్ ను మరియు సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేసి పరిశీలించారు.
అందులో భాగంగా పోలీస్ స్టేషన్ అవరణ, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, లాక్ అప్, మెన్ రెస్ట్ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్లో నమోదయిన గ్రేవ్, నాన్ గ్రేవ్ సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.