యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ ఓటర్లు. సుల్తానాబాద్ తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
ఓటు హక్కు మనందరి బాధ్యత రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు, ఈ హక్కును సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన వ్యక్తులను అధికారంలో తీసుకురావాలని సుపరిపాలన వలన రాష్ట్రం దేశం ఉన్నతమైన స్థితికి ఎదుగుతుందని, సుల్తానాబాద్ తాశీల్దార్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఓటు ఎందుకు వేయాలని నిర్లక్ష్యం వహిస్తున్న వేళ, ఒక బాధ్యతగా 80 సంవత్సరాల వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును తమ బాధ్యతగా స్వీకరించి వినియోగించుకోవాలని, ముఖ్యంగా నేటి యువత ముందుకు రావాలని, దేశ భవిష్యత్తు బాగు చేసే శక్తి వారి పైన ఉన్నదని పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ మండలంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు
80 సంవత్సరాలు నిండిన వృద్ధులకు సన్మానం చేశారు
పోలింగ్ స్టేషన్ నెంబర్.203 లో 80 సం,,లు పై బడిన ఓటరు ను గుర్తించి శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారి ఉమాదేవి, సూపర్ వైజర్ పి.సుకుమార్, రాజ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.