బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ కమిటి ఎన్నిక
ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/12
మండల కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుగులొత్ వీరు నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ మైనార్టి కమిటి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వోలం చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు.మైనార్టీ లందరూ ఏకాభిప్రాయంతో టిఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
అధ్యక్షులుగా – ఎండి గఫ్ఫార్
ఉపాద్యక్షులు – జలాల్ షరిఫ్
వర్కింగ్ ప్రసిడెంట్ – ఎండి మైనోధిన్
ప్రధాన కార్యదర్శి -ఎండి మదార్ సాహెబ్
కోశాధికారి – అంకుష అలి
ప్రచార కార్యదర్శి – ఎండి చాంద్ పాషా
సహాయ కార్యదర్శి – ఎస్కె యాకూబ్ పాష
కార్యనిర్వహక సభ్యులు -ఆజాం,రఫీ,సదిక్,సజిత్ మహబూబియా,రషీద్,బాబా,నజీర్
గౌరవ సభ్యులు – మహబూబ్,రజాక్ ఖాన్,సర్వర్ ఖాన్,హఫీజ్, మహబూబ్ సుభాని,షేరిఫ్ ఖాన్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్,పట్టణ ప్రధాన కార్యదర్శి తరాల వీరేష్, ఎంపీటీసీ ఆగే మంజుల వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు నజ్జు,గుంజపొడుగు కొమ్మాలు,సాయి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.