*ఎలికట్ట అంబ భవాని మాతకు వెండి కిరీటం బహుకరించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్
*సుమారు లక్ష రూపాయల విలువచేసే వెండి కిరీటం*
*అమ్మవారికి ప్రత్యేక పూజలు*
ప్రజా గొంతుక:షాద్ నగర్ ప్రతినిధి
దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఫరఖ్ నగర్ మండలం ఎలికట్ట అంబా భవాని మాతకు షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కొందూటి మహేశ్వరీదంపతులు, కుటుంబ సభ్యులు కొందూటి రవి చారి,రమాదేవి దంపతులు, కొందూటి శక్తిసాయి చరణ్ తో కలిసి సుమారు లక్షరూపాయల విలువచేసే వెండి కిరీటాన్ని బహూకరించారు. అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని, మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.