*షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంతే బాబాయ్ గెలుపు కన్ఫామ్
*అందె బాబయ్యకు మద్దతుగా బిజెపిలో చేరిన ఎలికట్ట గ్రామ నాయకులు
*షాద్ నగర్ :ప్రజా గొంతుక ప్రతినిధి*
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందే బాబయ్య కన్ఫామ్ గా గెలవబోతున్నారని ఎలికట్ట గ్రామస్తులు పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు
ఆధ్వర్యంలో ఎలికట్ట బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో 60 మంది బిజెపిలో చేరారు. నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరుతున్నట్లు వివరించడం జరిగింది. ఈటెల రాజేందర్ నివాసంలో ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామం నుండి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు మాజీ వార్డ్ మెంబర్స్, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ చౌడాపురం భీమయ్య, సీమ మల్లయ్య, చౌడపుర అంజయ్య, అంబటి వెంకటేష్, అంబటి ఆంజనేయులు, అంబటి మల్లేష్, చౌడాపురం మల్లేష్, కావలి మల్లేష్, సీమ శ్రీనివాస్, చౌడాపురం బలరాం, జి రఘు, సీమ కుమార్, శ్రీకాంత్, జి రాము, సీమ యాదయ్య, ఢిల్లీ శివకుమార్ మరికొంతమంది ఈటల రాజేందర్ సమక్షంలో అందే బాబయ్య కు అండగా బిజెపిలో చేరడం జరిగిందన్నారు.