*సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం…
*అలాయ్ బాలయ్ కార్యక్రమానికి హాజరు…
*సెంట్రల్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ ను కలిసిన ప్రముఖ కాంట్రాక్టర్, కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్…
సెంట్రల్ మినిస్టర్ సత్యపాల్ ను పెద్ద పూర్ గ్రామానికి ఆహ్వానించిన శ్రీనివాస్ గౌడ్…
ప్రజా గొంతుక న్యూస్ : రంగారెడ్డి జిల్లా బ్యూరో
సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రమని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బెగెల్, అన్నారు.బుధవారం హైదరాబాద్ లోని హర్యానా గవర్నర్ బండరు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అగ్రా లోక్ సభ సభ్యుడు,సెంట్రల్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బెగెల్ ముఖ్య అతథిగా హజరయ్యారు.అనంతరం మంత్రి సత్యపాల్ శ్రీశైలంలో జ్యోతిర్ లింగం,శక్తి పిటలైన శ్రీ బ్రమరంభ మల్లీ ఖార్జున స్వామి దర్శనానికి బయలు దేరారు..
ఈ సందర్భంగా వెళ్దాండ మండలం పెద్ద పుర్ గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్,కొమ్మగొని శ్రీనివాస్ గౌడ్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బెగెల్ ఫ్యామిలీ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సన్మానించి,తెలంగాణ దసరా పండుగ యొక్క జమ్మి ఆకులను ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కొద్ది సేపు శ్రీనివాస్ గౌడ్ తో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ కొద్ది సేపు ముచ్చటించారు.అలయ్ భాలయ్ కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయకరంగ వండిన వంటలను గుర్తు చేశారు..చాలా రుచికరంగా ఉన్నాయని,ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు.అదే విదంగా 2023 ఎన్నికల గూర్చి ఆరా తీశారు. పార్టీ స్థితి గతులపై చర్చించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ పెద్దపూర్ హెల్త్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బేగెల్ ను ఆహ్వానించారు..ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అశోక్ చారి,బిజేపి టౌన్ ప్రెసిడెంట్ ,కౌన్సిలర్ ఎన్.రాఘవేందర్ గౌడ్,బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మొగిలి దుర్గ ప్రసాద్,బిజేపి ఎంపిటిసి నర్సి రెడ్డి,జిల్లా ప్రధాన కర్యదర్శి కృష్ణ గౌడ్,నరెడ్ల శేఖర్ రెడ్డి,నితిన్ చారి,ఎండి జిలానీ,కొమ్మాగొని శేఖర్ గౌడ్ తదితులున్నారు…