ప్రోత్సహంతో గ్రామ అభివృద్ధి మరింత ముందుకు
గ్రామ అభివృద్ధి మా లక్ష్యం
నాగిరెడ్డిపల్లి సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ కలెక్టర్ రేట్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీగా నాగిరెడ్డి పల్లె గ్రామానికి అవార్డు రావడం జరిగింది గ్రామ సర్పంచ్ తాతిరెడ్డి భవాని శశిధర్ రెడ్డి కి మరియు గ్రామ సెక్రెటరీ శ్రీరామోజు రాధాకృష్ణ లకు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య , జిల్లా కలెక్టర్ శివ లింగయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
అనంతరం బచ్చన్నపేట ఎంపీడీవో రఘు రామకృష్ణ చేతుల మీదుగా గ్రామ ఉపసర్పంచ్ బూడిద శ్రీనివాస్ గౌడ్.. కి, మరియు పాలకవర్గం సభ్యులు.. మామిడాల నరేష్, వెల్దండ రవి, పెరుమాళ్ళ రాణి బెన్నీ, శ్రీరాముల మహేశ్వరి కిష్టయ్య, మంజే రాజు, పాండవుల మల్లయ్య, గొల్లపల్లి లక్ష్మీ యాదగిరి, షేక్ కాశీంబి గార్లకు.. మరియు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీరాముల కనకయ్య, ఆశ వర్కర్ గద్దరాజు లలిత, సిఏలు తాతిరెడ్డి సులోచన, పెరుమళ్ళ హేమలత, కారోబార్ బాబు, సిబ్బంది మంగోలు నరేష్, కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ మైముద్, ఎలక్ట్రిషన్ మంగోలు కుమార్ కు శాలువాతో సత్కరించడం జరిగింది.గ్రామ యువకులు మామిడాల విజేందర్, మహమ్మద్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు..
ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్తమ అవార్డు రావడానికి వార్డు మెంబర్లు, సి ఏ లు వివో లు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ యువకులు.గ్రామ ప్రజలు అందరూ సహకరించడం వల్లనే ఈ అవార్డు వచ్చిందని తెలియజేశారు.గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.