మొండ్రాయి రైతు వేదికలో ఏ.ఈ.ఓ రాజేందర్ ను బంధించిన రైతులు
మొండ్రాయి రైతు వేదికలో ఏ.ఈ.ఓ రాజేందర్ ను బంధించిన రైతులు
రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్
-రైతు వేదికలొనె కూర్చుని పంట నష్టం సర్వే చేసిన ఏ.ఈ.ఓ
-స్థానిక సమాన్వయ సమితి సభ్యులు చెప్పిందే వేదం…వారు రాపించిన వారికే పంట నష్టం పరిహారం
-బీఆరెస్ నాయకులకు మాత్రమే 10000వెల పంట నష్ట పరిహరం..మిగితా రైతులకు 500నుండి4000 వరకు చెక్కుల పంపిణీ
ప్రజా గొంతుక// వరంగల్ జిల్లా //సంగెం ప్రతినిధి:
సంగెం మండలంలోని వివిధ గ్రామాలలో గత మార్చి నెలలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఏకారాకు 10000 కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే…కాగా
మొండ్రాయి గ్రామంలో ఎకరాకు 500 నుండి 3000 వేయిల రూపాయలు పడటంతొ రైతులు లబోధిబో మని బోరున విలపిస్తున్నారు.విషయానికి వస్తే మొండ్రాయి గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించడానికి తగు సమయం ఉన్నా గ్రామ ఏ.ఓ.ఓ.రాజేందర్ రైతు వేదికలోనే కూర్చొని ఒకరిద్దరిని పక్కన పెట్టుకొని పూర్తి లిస్టు ప్రిపేర్ చేసిన ఎ.ఇ.వో పనితనాన్ని రైతులు చాలా బాధాకరంగా
విన్నవించుకొన్నారు.కొంతమందికి ఎకరం నష్టపోయిన రెండు మూడు ఎకరాలు రాపించుకోవడం జరిగిందని తెలిపారు,కానీ దాదాపుగా మూడు ఎకరాలు నష్టపోతే కేవలం 10 గుంటలే నష్టపరిహారం రాశారని తెలిపారు.ఏదిఎమైన ఏ.ఈ.ఓ పై తగు చర్యలు తీసుకొవాలని,అసలైన రైతులకు పంట నష్టపరిహరం అందలేదని,ఏ.ఈ.ఓ పనితనాన్ని నిరసిస్తూ గ్రామ రైతు వేదికకు తాళం వేసిన రైతులు.