ప్రభుత్వంనిర్దేశించినధరలకేఎరువులు,పురుగుమందులను రైతులకు చెల్లించాలి.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా కేంద్రంలోనిపాతబస్టాండ్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిఆకస్మికంగాతనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్టాక్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ, ఎరువుల దుకాణానికి వచ్చినఎరువులు,అమ్మినఎరువులు,స్టాక్,నిలువలను పరిశీలించారు. యూరియా,డిఏపి,ఎమ్ఓపి ,కాంప్లెక్స్ఎరువులు, ఎన్నిబస్తాలువచ్చాయని రైతులకువేటిఆధారంగా ఎరువులు ఇస్తారని దుకాణదారుడిని,వివరాలుఅడిగితెలుసుకున్నారు. దుకాణానికి వచ్చిన స్టాక్ ఎంత ఉంది, ఇంకా ఎంతరావాల్సిఉందనీ,ఇప్పటి వరకు ఎంత స్టాకు అమ్మా కలెక్టర్ క్రాంతి వివరాలనుఅడిగితెలుసుకున్నారు. అంతేకాక గోడౌన్ లో నిల్వ ఉన్న ఎరువులు ఎంత అని అడుగగా 3000 మెట్రిక్ టన్నులయూరియాస్టాకు ఉందని,ఇంకా 2000 టన్నులయూరియరావాల్సి ఉందని నా దారుడు కలెక్టర్ కు తెలిపారు. యూరియా,ఇఫ్కో,పొటాష్,ఎరువులు ఈపాస్ ప్రకారంఎరువులనుఅమ్మాలని, గోడౌన్లోఉన్న ఎరువులుసరిపోయేటట్లుచూడాలని,జిల్లాలోని ఎరువులదుకాణదారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎరువుల ను అమ్మాలని,ఎవరైనా ఎరువులు బ్లాక్ లో అమ్మినట్లయితే కఠిన చర్యలుతీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలోజిల్లా వ్యవసాయశాఖఅధికారి గోవింద్ నాయక్, ఏడిఏ సంగీత లక్ష్మి, ఎం ఇ ఓ ప్రసాద్, దామోదర్ రెడ్డి , తదితరులు ఉన్నారు.