పేటలో తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవ వేడుకలు
ప్రజా గొంతుక ప్రతినిధి/ అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట లో
మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులుతో కలిసి తాటి అశ్వారావుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి “డా” ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు,145 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు మీదుగా 4081 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్య లు అవగతం చేసుకున్నారన్నారు. ఈ యాత్ర దేశ చరిత్ర లో నిలిచిపోతుందన్నారు .భారత్ జోడో యాత్ర పేరుతో ఏడాది పాటు దేశ వ్యాప్తంగా కాలినడకన తీరిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే అని అయన అన్నారు.
అటు దేశంలో ,ఇటు రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు .ఈ కార్యక్రమంలో సుంకరవల్లి వీరభద్రరావు , జస్ట సత్యనారాయణ చౌదరి, దాసరి నాగేందర్ రావు, కోడూరు శ్రీను , మొగిలి రాంబాబు, పొట్ట రాజులు, రోశయ్య, ఏసు గారు, మోహన్ రావు , రామారావు , భూక్య ప్రసాద్ , ఆగిరిపల్లి రాంబాబు , గట్టి సతీష్ , హలవత్ శ్రీను , సీమట బోయిన సత్యనారాయణ, కాకర్ల సోమేశ్వరరావు తో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…