సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
పాపన్నపెట్ ప్రజా గొంతుక
మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి.పి. రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశానుసారం మెదక్ పట్టణం లోని ఇందిరా గాంధీ స్టేడియం ద్యాన్ చంద్ చౌరస్తా నుండి పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించిన జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ. ఎస్. మహేందర్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి
శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్
జిల్లాలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరుగకుండా ప్రజలంతా సహకరించాలని జిల్లా .పి.రోహిణి ప్రియదర్శిని ఐపిఎస్ అన్నారు. మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ ప్రారంభం చేసి పారా మిలిటరీ దళాలతో కలిసి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గాంధీనగర్ సుభాష్ నగర్ దాయరా ఫతేనగర్, పెద్ద బజార్ మజీద్ నవపేట్ ఓల్డ్ బస్టాండ్ శాంతినగర్ నర్సిఖడ్ వీధుల అనంతరం మెదక్ రూరల్ పిఎస్ పరిధిలోని రాచపల్లి గ్రామంలోనీ వీదుల గుండా కవాతు లో పాల్గొన్నారు. అనంతరం పారామీటర్ దళాలకు ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని,రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు . ఇందులో నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామము, జిల్లా అభివృద్ధి చెందుతుందని కావున ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఒకరికి ఒకరు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ఎస్ మహేందర్ పాటు మెదక్ డిఎస్పి శ్రీ ఫణింద్ర గారు మెదక్ పట్టణ సీఐ వెంకట్ గారు మెదక్ రూరల్ సీఐ శ్రీ రాజశేఖర్ రెడ్డి ఎస్పీ మెదక్ పట్టణ ఎస్ఐ పోచయ్య ఎస్ఐలు, పారా మిలిటరీ బలగాలతో పాటు జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.