ధ్వజస్తంభల ప్రతిష్టాపన పూజ మహోత్సవం
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
పూర్వ దేవాలయాలకు వైభవంగా పూజలు, దైవభక్తితో నిర్వహించాలని సంకల్పంతో ధ్వజ స్తంభాల నిర్మాణ ఏర్పాటుకు భూమి పూజ చేసి ప్రతిష్టాపన చేశారు.
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పడమటి కేశవాపూర్ గ్రామంలో,శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ సమితి, సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి 25ఫీట్ల ధ్వజస్తంభం స్తాపించుటకు అలాగే నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కళ్యాణ వేంటేశ్వరస్వామి ఆలయం కొరకు 45ఫీట్ల ధ్వజస్తంభం రెండింటినీ బుధవారం రోజున నవగ్రహ స్థాపితం చేయడం జరిగింది.
ఈ కార్య్రమానికి గూడ గోపాల్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, వనం సదానందం, బండారి ఆంజనేయులు, గొట్టం వెంకట్ రెడ్డి, జీడిపల్లి ,సత్తి రెడ్డి, తాండ్ర అఖిలేష్ రెడ్డి, గూడ యాదగిరి రెడ్డి, గర్నేపల్లి సురేష్, గజ్జెలి బాల్ నారాయణ, తారిగొప్పుల సత్తయ్య మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.