*గ్రామీణ రహదారులకు నిధుల వరద
*18 గ్రామాల బీటీ రోడ్లకు రూ.46.22 కోట్లు
*మరో మరో పల్లెలపై తన ప్రేమను చాటుకున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ .
*షాద్ నగర్ :అక్టోబర్ 08(ప్రజా గొంతుక న్యూస్ )
షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మరోమారు పల్లెల అభివృద్ధిపై తన ప్రేమను చాటుకున్నారు. మారుమూల పల్లెల రోడ్ల అభివృద్ధి కోసం నిధుల వరుద ను పారుస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖ నుండి రూ. 46.22 కోట్ల నిధుల ను మంజూరు మంజూరు చేయించి నియోజకవర్గంలోని 18 గ్రామాలకు సంబంధించిన సుమారు 34 కిలోమీటర్ల మేర ఉన్న దారులను బి.టీ పనులతో ఆధునీకరించనున్నారు.
ఫరూఖ్ నగర్ మండలం చిన్నచిలక మర్రి నుంచి కమ్మదనం వరకు రూ. 2.42 కోట్లు, కొండన్నగూడ నుంచి నాటకో పరిశ్రమ రోడ్డు వరకు రూ.2.3 కోట్లు, చించోడు నుంచి వెంకటరెడ్డి పల్లి వరకు రూ. 2.95 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఎల్లంపల్లి వరకు రూ.2.4 కోట్లు, ఎలికట్ట రోడ్డు నుంచి కిషన్ నగర్ వరకు రూ. 2.35 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి పీర్లగూడం వరకు రూ. 2.25 కోట్ల నిధులు రోడ్లను బాగు చేసేందుకు విడుదలయ్యాయి. కేశంపేట మండలంలోని నిర్దవెళ్లి నుంచి లింగందన్న వరకు రూ. 5.30 కోట్లు, ఇప్పలపల్లి నుంచి శేరిగూడ వరకు రూ.2.44 కోట్లు, సుందరాపురం నుంచి లే మామిడి రోడ్డు వరకు రూ. 2.13 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి అవజ్ మియా పపడకల్ వరకు రూ. 1 కోట్లు, వేముల నర్వ ఎస్సీ కాలనీ మీదుగా చౌదరి గూడెం వరకు రూ.1.49 కోట్ల నిధులను బీటి రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. కొందుర్గు, చౌదరిగూడ మండలాలలో రేగడి చిలకమర్రి నుంచి కంకల్ వరకు రూ. 2.8 కోట్లు, పర్వతాపూర్ నుంచి నవపేట్ బీటీ రోడ్డు వరకు రూ. 2.22 కోట్లు, పెద్ద ఎల్కిచర్ల బీటి రోడ్డు నుంచి మముజాయితీపూర్ వరకు రూ. 3. 85 కోట్లు, బీటీ రోడ్డు నుంచి చింతకుంట తండా వరకు రూ.1.2 కోట్లు, రేగడి చిలుక మర్రి నుంచి చింతలపల్లి వరకు రూ 1.80 కోట్ల నిధులతో రోడ్లను బీటి రోడ్లుగా ఆధునీకరించనున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు అధిక నిధులను కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. ఏ ప్రాంతంలో అయితే రోడ్లు బాగుంటాయో, రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటుందో ఆ ప్రాంతాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత బీ.టీ రోడ్లకు అధిక నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు.