బిఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ ఏడుపాయల మాజీ డైరెక్టర్లు రాజీనామా
పాపన్నపెట్ ప్రజా గొంతుక
బిఆర్ఎస్ పార్టీకిమాజీ ఏడుపాయల డైరెక్టర్లు రాజీనామా చేశారు. గాంధారిపల్లికి చెందిన పాశం జ్యోతి అంజిరెడ్డి, ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి శ్రీధర్ రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు.
సుమారు 50 నుంచి 100 మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి బుధవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతుందని, కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతగా కృషిచేసినా గుర్తింపు లేకపోవడం బాధను కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.