*కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి*
*మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి*
*ముట్పూర్ లో జోరుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం*
ప్రజా గొంతుక :షాద్ నగర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కోరారు. కొందుర్గ్ మండలం ముట్పూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జెడ్పిటిసి మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ దొంగ హామీలు, మాయమాటలు నమ్మకూడదని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన సాగుతుందని వారిని ఇంటికి పంపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.