మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి…!
– ఖేడ్ రాజకీయాల్లో అనూహ్య మలుపు ,
– మారనున్న సమీకరణాలు,
కంగ్టి, నారాయణఖేడ్,
నవంబర్ 12, ప్రజా గొంతుక న్యూస్ :-
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం రాజకీయ చాణక్యుడిగా పేరొందిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయషాల్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి హరీష్ రావును కలిసిన విజయపాల్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా బీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయపాల్‌రెడ్డి.. 1994లో టీడీపీ నుంచి నారాయణభేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రస్తుత ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి స్వయాన సోదరుడైన విజయపాల్‌రెడ్డీకి నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉంది. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడం నారాయణఖేడ్ రాజకీయాల్లోనే అనూహ్య మలుపు తిరిగింది. ఈ పరిణామంతో రాజకీయ సమీ కరణాలు మారి బీఆర్‌ఎస్ విజయం మరింత సులువు కానుంది. విజయపాల్‌రెడ్డి 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన వైపు అడుగులేసిన ప్రస్తుత ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో మహా రెడ్డి కుటుంబం విడిపోయింది. ఇప్పుడు విజయపాల్‌రెడ్డి చేరికతో ఇటు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో… మరీ ముఖ్యంగా మహారెడ్డి కుటుంబ అభిమానుల్లో నూతనోత్సాహం నిండింది.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.