ఆపదలో అండగా..పల్లా..
-యాక్సిడెంట్ లో వ్యక్తికి తీవ్ర గాయాలు
–రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన నాయకులు
–స్పందించిన రాజేశ్వర్ రెడ్డి
-నీలిమా హాస్పిటల్ లో ఉచిత వైద్యం
–ఎమ్మెల్యే అభ్యర్థికి బాధితుడి కృతజ్ఞతలు
ప్రజా గొంతుక /జనగామ :
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నాయకుడి లక్షణం..అలాంటి వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. అనారోగ్యం బారిన పడి తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థికసాయం అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు రాజేశ్వర్ రెడ్డి. వేలాది మందికి సీఎం సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు ఆర్థికసాయం అందిస్తూ పేద వారికి బాసటగా నిలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా సాయం అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అందుకు మరో ఉదాహరణ…
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జనగామ నుంచి ఎర్ర గొల్ల పహాడ్ వెళ్తున్న దయాకర్ కు వడ్లకొండ బైపాస్ దగ్గర ఎదురుగా ఆటో వచ్చి తగిలింది. దీంతో దయాకర్ తలకు, మోకాళ్లకు బాగా దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న దయాకర్ విషయాన్ని బురెడ్డి ప్రమోద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పల్లా అంబులెన్స్ ద్వారా నీలిమ హాస్పిటల్ కు తరలించి, అక్కడి వైద్యులతో మాట్లాడిద వారిని అందుబాటులో ఉంచారు. హాస్పిటల్ కు వెళ్లిన వెంటనే అత్యవసర సేవలను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో బాధితుడు, కుటుంబసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పారు.