గడ్డం సీత రంజిత్ రెడ్డినీ సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి ఎమ్మెల్యే సతీమణి కొప్పుల ప్రాతిమారెడ్డి
ప్రజా గొంతుక, పరిగి డివిజన్ ప్రతినిధి:
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా నామినేట్ అయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీత ని వారి నివాసంలో కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారి సతీమణి కొప్పుల ప్రాతిమారెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేస్తూ ఇంకా ఎన్నో పదవులు పొందాలని అన్నారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.