భారత్ జోడోపాదయాత్ర మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన గద్వాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
ముఖ్యఅతిథిగాఏఐసీసీ కార్యదర్శిసంపత్,కుమార్.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
అఖిలభారతకాంగ్రెస్,పార్టీఅగ్రనేత,మనప్రియతమనాయకుడు రాహుల్ గాంధీప్రతిష్టాత్మకంగాచేపట్టినభారత్,జోడోయాత్రమొదటివార్షికఉత్సవo సందర్భంగా ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకుభారత్,జోడోయాత్ర మొదటి సంవత్సరం సందర్భంగా, గద్వాల జిల్లాకాంగ్రెస్పార్టీఆధ్వర్యంలో సెప్టెంబర్ 07 గురువారం న జిల్లా కేంద్రంలోపెద్దఎత్తునర్యాలీ,పాదయాత్రనుఘనంగానిర్వహించారు.
ఈకార్యక్రమానికిముఖ్యఅతిథిగాఏఐసీసీకార్యదర్శి,మాజీశాసనసభ్యులు సంపత్కుమార్,పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర మొదటి వార్షిక ఉత్సవం సందర్భంగా గద్వాల జిల్లాకేంద్రంలోనీఅంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి పాదయాత్ర మొదలుపెడుతూ,వైఎస్సార్ చౌక్, కూరగాయల మార్కెట్ రోడ్, కిష్టారెడ్డి బంగ్లా, గాంధీ చౌక్, రాజీవ్ మార్గ్ మీదుగా వెళ్లి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈ పాదయాత్ర ముగించడం జరిగినది.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ, మనప్రియతమనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇంతవరకు ఎవరు చేయని విధంగా పాదయాత్రచేసిచూపిస్తున్నవ్యక్తిఎవరైనాఉన్నారంటే అది రాహుల్ గాందేననీ, దాదాపు 4000 కి పైగ కిలోమీటర్లు నడవడం జరిగినదనీ సంపత్,కుమార్,అన్నారు
ఈపాదయాత్రసందర్భంగా భారతదేశాన్ని ఒకటికి ఇలా చేయడమే ఉద్దేశంతో ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూపేదలపరిస్థితులు,ఇప్పుడున్నప్రజాస్వామ్యానికిఇలాకాపాడుకోవాలని ఆలోచనతో ఇన్ని వేల కిలోమీటర్లు నడిచి తెలుసుకోవడం జరిగిందనీసంపత్అన్నారు.
బిజెపిపాలనలో ప్రజల వ్యతిరేక పాలన ఉన్నదనీ, మతాల మధ్య కొట్లాటలు ఉన్నవనీ, కులాల వద్ద కొట్లాటలు పెట్టే పాలన ఉన్నదనీ, ఇలాంటి పాలనని చరమ గీతం పాడాలని భారతదేశం మొత్తం ఏకం కావాలనే ఉద్దేశంతో ఈపాదయాత్ర చేయడం జరిగినదనీ సంపత్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి ఈసారి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈపాదయాత్ర చేయడంజరిగిందనిసంపత్ కుమార్,చెప్పారు.
జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్రెడ్డిమాట్లాడుతూ,భారత్ జోడోపాదయాత్ర ప్రపంచంలో కనీ,విని ఏరగని పాదయాత్రఅని ఎండనైనా, వాననైన, ఎలాంటి వాతావరనాన్ని అయినా తట్టుకొని చరిత్రలో నిలిచిపోయే యాత్రను మాప్రియతమ నాయకుడు ఎఐసిసి ఆగ్ర నేత రాహుల్ గాంధీ భారతదేశప్రజలుఏకంగా ఉండాలనే ఉద్దేశంతో చేసిన పాదయాత్రఅని కులాలు, మతాలు వర్గాలు ఎన్ని విభేదాలు ఉన్నా భారతదేశం మొత్తం ఒకటేననీ, అదే ఉద్దేశంతో ఈపాదయాత్ర చేయడం జరిగిందనీ పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వము వాళ్ళ మిత్రులు ఆదానీ, అంబానీలకిప్రజలఆస్తులు తాకట్టు పెడుతూ ఉంటే ఇది చూడలేక ప్రజలు మేలుకోండి మీరు మేలుకొని భారతదేశాన్ని కాపాడుకుందామనీ, భారతదేశం మొత్తం కలిసి పోరాడుదామనీ భారతీయులంతా ఒకటే అనేనినాదముతోభారత్ జోడో పాదయాత్ర జరిగినదనీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. భారత్ జొడోపాదయాత్రకర్ణాటక నుంచి తెలంగాణలో వస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ కి స్వాగతించడానికి గద్వాల కేంద్రం నుంచి 2000 మంది కి పైగా శక్తి నగర్ కు తీసుకువెళ్లి, ఒక రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయాన్నేరాహుల్ గాంధీకిస్వాగతంపలకడం జరిగినదని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
జడ్పీచైర్మన్,సరితిరుపతయ్యమాట్లాడుతూ, భారత జోడోపాదయాత్ర చాలా గొప్ప పాదయాత్ర ఇంత పెద్ద పాదయాత్ర ఎప్పుడుఎవరుచేయలేదు.ఈపాదయాత్రముఖ్య ఉద్దేశ్యంభారతదేశం మొత్తం ఏకం చేయాలి కులము మతము అని కొట్లాడకుండా అందరూ భారతీయులమనే ఉద్దేశంతోచేపట్టినపాదయాత్ర ఈ పాదయాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ పాదయాత్రలో చెప్పిన సందేశాన్ని ప్రజల్లోతీసుకుపోవడానికి ఉద్దేశంతో ఈరోజు మేము గద్వాల టౌన్ లో పాదయాత్ర చేయడం జరిగినదని జెడ్పి చైర్ పర్సన్ సరిత చెప్పారు.
ఈకార్యక్రమంలోగద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, తిరగబడతాం-తరిమికొడదాం కోఆర్డినేటర్లు సరిత తిరుపతయ్య, రాజీవ్ రెడ్డి, డాక్టర్ కురువ విజయకుమార్, బల్గిర నారాయణరెడ్డి, వీరబాబు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ కౌన్సిలర్ ఇసాక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నల్లా రెడ్డి,జిల్లా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ మరియు జిల్లా జనరల్సెక్రెటరీషేక్,జమాల్,జిల్లా ఉపాధ్యక్షులు అలెగ్జాoడర్,పూలకరుణాకర్, తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుఇలియాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ మజీద్,జిల్లా మైనార్టీ అధ్యక్షులు కిఫాయత్, జిల్లా ఎస్టీసెల్అధ్యక్షులు శివ నాయక్, గద్వాల నియోజకవర్గ మండల అధ్యక్షులురఘునాయుడు,శ్రీకాంత్,గౌడ్,మభశ,విశ్వనాథ్ రెడ్డి,వెంకటేష్, జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షులు కొత్త గణేష్,రాము,కౌసర్ బేగ్, జహంగీర్,శివరాజ్,శాశ,ఆనంద్,వీరేష్,రమేష్
మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అభిమానులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.