* అంగరంగ వైభవంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు
ప్రజా గొంతుక న్యూస్/ జగిత్యాల/ రాయికల్
మండల పరిధిలోని రామాజీపేట గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద గణపతి, శ్రీ శివాజీ రెడ్డి సంఘం గణపతి మరియు రావణ సేన యూత్ గణపతి సభ్యుల ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపతి మండపాల వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల పరిధిలోని ఆయ గ్రామాల ప్రజకు సుఖశాంతులను అందించాలని,ప్రజలందరిని చల్లగా చూడాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ…..
కులాలకు అతీతంగా సోదర భావంతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అన్నారు.
అనంతరం వచ్చిన భక్తులకు,గ్రామస్తులకు ప్రసాదాలు పంపకం చేసి గణనాథుని భక్తిశ్రద్ధలతో శోభయాత్రలతో నిమజ్జనం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అన్ని మండపాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.