*అంబరాన్నటిన లిమ్స్ హాస్పిటల్ లో గణపతి శోభాయాత్ర
*పూజ కార్యక్రమంలో పాల్గొన్న లీమ్స్ ఎండి డాక్టర్ రామ్ రాజ్
*- వినాయక లడ్డును వేలం పాటలో 31000 రూపాయలకు దక్కించుకున్న లిమ్స్ డాక్టర్స్
ప్రజా గొంతుక :శంషాబాద్ ప్రతినిధి
శంషాబాద్ పట్టణం లిమ్స్ హాస్పిటల్ లో,డాక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ రామ్ రాజ్,ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రులు పూజలందుకున్నటువంటి విఘ్నేశ్వరుడు, మంగళవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి.లిమ్స్ హాస్పిటల్ లో ఈసారి లడ్డు వేలం భారీ మొత్తంలో పోవడం జరిగింది. హోరాహోరీగా సాగిన లడ్డు వేలంలో పాటలో లీమ్స్ డాక్టర్స్, 31000 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం విజ్ఞేశ్వరుడి ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. గణపయ్య శోభాయాత్ర కొనసాగింది.శోభాయాత్ర అడుగడుగునా గణపయ్యకు భక్తుల నీరాజనం నిమజ్జనోత్సవంలో అంబరాన్నంటాయి.గణనాథ ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది.భక్తులు.జై గణపతి…జై జై గణపతి.. గణపతి బొప్పా మోరియా ఆదాలడ్డూ కాలియా.. అంటూ భక్తులు నినాదాలు చేశారు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ నిమజ్జన కార్యక్రమంలో, ఉత్సవ కార్యక్రమాలు మధురానగర్ లిమ్స్ హాస్పిటల్ నుండి కాముని చెరువు వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్. రామ్ రాజ్,డాక్టర్.విశ్వనాధ్,డాక్టర్ గోవర్ధన్,డాక్టర్ విశ్వతేజ, డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ సంతోష్,డాక్టర్ కళ్యణ్ వర్మ,డాక్టర్ స్మిత,డాక్టర్ శ్వేతా,డాక్టర్ అనిల్,డాక్టర్ అను రాధా,డాక్టర్ సురేష్,డాక్టర్,శంకర్,డాక్టర్,నిషిత్ రెడ్డి,డాక్టర్ మిథున్
డాక్టర్,సుధీర్,రెడ్డి,డాక్టర్,యోక్షదార,డాక్టర్ నరేష్ డాక్టర్ రవి కిరణ్,డాక్టర్. శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.